Friday, April 26, 2024

TS | రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన‌ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సహజ సిద్ధమైన రంగులతో పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ హోలీకి అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు. కెమికల్స్ కలిగి ఉన్న రంగులను హోలీ పండుగ సందర్భంగా వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం అని సూచించారు.

కాగా, దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఒక రోజు ముందుగానే ప్రజలు హోలీ సంబరాలు షురూ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సంతోషంగా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement