Saturday, April 27, 2024

TS | క్రిస్టియన్లందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడేను క్రైస్తవ సోదరులు, సోదరీమణులు జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యేసుక్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే పండగ గుడ్ ఫ్రైడే అని గుర్తుచేశారు. యేసుక్రీస్తు మానవాళికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాడు. ఆయన బోధించిన సేవ, దయ, సౌభ్రాతృత్వంతో పాటు యేసుక్రీస్తు బోధించిన శాంతి, కరుణ సందేశాన్ని ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement