Wednesday, June 5, 2024

అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన : మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి

నిజామాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలు స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పాటుపడిన వ్యక్తి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని మంత్రి వేముల కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. అంబేద్కర్ ని అత్యంత గౌరవించే వ్యక్తి కేసీఆర్ అని అందుకే వారి ఆశయాలు, ఆలోచనలు భారత దేశంలోనే సంపూర్ణంగా అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఘంటాపథంగా చెబుతున్నాఅన్నారు. ఆ మహనీయుని సేవలను స్మరించుకునే విధంగా కొత్త సెక్రటేరియట్ కు ఆయన పేరు పెట్టుకున్నామని, హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశనంలో తన పర్యవేక్షణలో ఈ చారిత్రక నిర్మాణాలు జరగడం తన అదృష్టం అన్నారు. ఈ గొప్ప నిర్మాణాల్లో తనకు భాగస్వామ్యం కల్పించిన కేసిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాయావతి కూడా అణగారిన వర్గాల ప్రజల కోసం చేయని సంక్షేమ కార్యక్రమాలు నేడు కేసీఆర్ తెలంగాణలో చేస్తున్నారని వెల్లడించారు. మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్సి రాజేశ్వర్ రావు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement