Wednesday, May 8, 2024

విద్యా దీవెన పథకంతో 11లక్షల మంది విద్యార్థులకు లబ్ధి.. సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన పథకంతో 11లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామన్నారు. రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఏప్రిల్‌-జూన్‌ 2022 కాలానికి గానూ 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement