Friday, November 8, 2024

AP | ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి కేసులో పురోగతి..

కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విఘ్నేష్‌తో పాటు ఆటో డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా, గోపవరం మండలం సెంచరీ ప్లైవుడ్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి ఇంటర్ విద్యార్థినిని తీసుకెళ్లిన నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థిని 80 శాతం కాలిన గాయాలతో కడప రిమ్స్‌లో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేప‌ట్టి నిందితున్ని పట్టుకున్నారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement