Monday, April 29, 2024

పేదల కోసం దుస్తుల బ్యాంక్!.. లక్నోలో సరికొత్త సంక్షేమ కార్యక్రమం

లక్నో: పేదలను ఆదుకునేందుకు లక్నో జిల్లా అధికార యంత్రాంగం సరికొత్త సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముందుగా లక్నో మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలకు సాయం చేయాలనుకునేవారు పోస్టులో కాని, జోనల్ కార్యాలయాలకు గానీ వస్ర్తాలను పంపొచ్చని, ఆయా కేంద్రాల్లో క్లోత్స్ బ్యాంకుల్లో భద్రపరచి నిరుపేదలకు పంపిణీ చేస్తామని జిల్లాకలెక్టర్ అభిషేక్ ప్రకాశ్ ప్రకటించారు.

లక్నో నగర పాలక సంస్థ పరిథిలో ఎనిమది చోట్ల ఈ క్లోత్ బ్యాంక్కేంద్రాలను ప్రారభించామని చెప్పారు. ప్రస్తుతం ఈ నగరపాలక సంస్థ పరిథిలో 36 శరణాలయాలున్నాయని, అందులోని పేదలకు ఈ దుస్తులుఅందిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement