Wednesday, May 1, 2024

Clashes | ఉత్తరాఖండ్‌లో చెలరేగిన అల్లర్లు.. ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో హింస చెలరేగింది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనలో ఆరుగురు ఆందోళనకారులు మరణించారు. మరో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులతో పాటు మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మున్సిపల్ కార్మికులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిగారు.

ఈ క్రమంలోనే ఆరుగురు దుర్మరణం చెందారు. మరోవైపు రాళ్ల దాడిలో వందల మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పోలీసులు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. నగరంలోని బన్‌భూల్‌పుర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా మదర్సాతోపాటు మసీదును నిర్మించారు. వాటిని తొలగించాలని గతంలో నిర్వాహకులకు నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు గురువారం రోజున ఉన్నతాధికారులు పోలీసు బందోబస్తు మధ్య మదర్సా, మసీదుల కూల్చివేతకు సిద్ధమయ్యారు. వారిని స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపినా అధికారులు బుల్డోజరుతో మదర్సాను కూల్చివేయించడంతో ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement