Tuesday, May 7, 2024

మ‌ణిపూర్ లో మ‌ళ్లీ హింసాకాండ – 17 మందికి గాయాలు

మణిపూర్ బిష్ణుపూర్ జిల్లాలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. కంగ్వాయి, ఫౌగాచావో ప్రాంతాల్లో గురువారం హింస చెలరేగింది. కొంతమంది ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ, ఆర్ఏఎఫ్ సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారని అధికారులు తెలిపారు. ఇక ఈ హింసలో 17 మంది ఆందోళనకారులు గాయపడ్డట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఇది ఇలా ఉండ‌గా, ప్రభుత్వ యంత్రాంగం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ సహా భిషంపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును ఉపసంహరించుకుంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధించారు. మరోవైపు మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. గురువారం కూడా పార్లమెంట్‌లో విపక్షాలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో పార్లమెంట్‌ కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వచ్చింది.

మరోవైపు, మణిపూర్ హైకోర్టు గురువారం తెల్లవారుజామున కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతిపాదిత భూమికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. హింసాకాండలో మరణించిన కుకీ వర్గానికి చెందిన వారి మృతదేహాలను ఈ భూమిలో ఖననం చేయాలని ఆదేశాలిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement