Thursday, April 25, 2024

మరోసారి తెరపైకి పెగాసస్‌ అంశం..సీజేఐ కీలక వ్యాఖ్యలు

పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్‌పై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. కమిటీకి సంబంధించి వచ్చేవారం ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది సుప్రీంకోర్టు.. భారత పౌరులపై నిఘా కోసం ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి.. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. కాగా, ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్‌ను తమ ఏజెన్సీలు ఉపయోగిస్తున్నాయో లేదో బహిరంగపరచడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో కోర్టు సెప్టెంబర్ 13 న ఈ కేసులో తన ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది. గత విచారణ సమయంలో.. కేంద్ర ప్రభుత్వం.. తన ఏజెన్సీల ద్వారా పెగాసస్ వినియోగంపై సమాచారం పంచుకోవడానికి.. పిటిషనర్లను అడ్డుకోవడానికి నిర్దిష్ట సమాచారాన్ని అందజేయడానికి నిరాకరించింది.

ఇక, న్యాయమూర్తులు సూర్య కాంత్ మరియు హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం, న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేయడం మరియు స్వతంత్ర విచారణకు సంబంధించిన ఇతర అనుబంధ అంశాలపై రాబోయే 3-4 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయనుంది.. అయితే, పెగాసస్ వ్యవహారంలో ఆగస్టు 16న ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. పెగాసస్ వంటి నిర్దిష్ట సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించడంపై.. అఫిడవిట్ లేదా బహిరంగ చర్చకు సంబంధించిన అంశం కాదని పునరుద్ఘాటించారు. మంత్రులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కార్యకర్తలు మరియు జర్నలిస్టుల ఫోన్‌లను హ్యాక్ చేయడానికి మిలిటరీ గ్రేడ్ స్పైవేర్‌ని ఉపయోగించడాన్ని ఈ అఫిడవిట్ ధృవీకరించలేదు.. ఇదే సమయంలో తిరస్కరించని సంగతి కూడా విదితమే. అయితే, ఇవాళ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ ఎన్వీ రమణ. పెగాసస్ స్నూపింగ్ వ్యవహారంలో విచారణకు సుప్రీం కోర్టు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి:

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement