Thursday, March 28, 2024

అన్నమయ్య కీర్తనలు : అరుదీకపీంద్రుని

అరుదీకపీం ద్రుని అధిక ప్రతాపము
సురలకు నరులకీసుద్దు లెందు గలవా ||

ఉదయాచలము మీదినొక్కజంగ చాచుకొని
ఉదుటున నవరాద్రి నొక్కజంగ చాచుకొని
తుద సూర్యమండలము తోడ మోము దిప్పుకొంటా
పెదవు లెత్తి చదివె పెద్దహనుమంతుడు ||

వొక్కమొలగంట చంద్రు డొక్క మొలగంట రవి
చుక్కలు మొలపూసలై చూపట్టగా
నిక్కిన వాలాగ్రమందు నిండిన బ్రహ్మలోకము
పిక్కటిల్ల పెరిగెను పెద్దహనుమంతుడు ||

పిడికిలించిన చేత బిరుదులపండ్లగొల
తడయక కుడిచేత దశదిక్కుల
జడియక శ్రీవేంకటేశ్వరుని మన్ననబంటు
బెడిదపు మహిమల పెద్దహనుమంతుడు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement