Sunday, April 28, 2024

సిట‌డెల్ ట్రైల‌ర్.. అదిరిన యాక్ష‌న్ సీక్వెన్స్

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది సిట‌డెల్ సిరీస్. ఈ సిరీస్ లో హాలీవుడ్ న‌టుడు రిచర్డ్ మాడెన్,గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్నారు.. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమాల దర్శకులు రుసో బ్రదర్స్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు.’సిటాడెల్’ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.గతం మర్చిపోయిన ఇద్దరు ఏజెంట్లు ఒకరినొకరు కలవడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. సడన్ గా వారిద్దరి మీద కొందరు అటాక్ చేయడం, వారు ఒకరికి ఒకరు గుర్తుకురావడం ఇలా ఆసక్తికరంగా ఈ ట్రైలర్ సాగుతుంది. వీరిద్దరూ ఏ దేశానికి చెందిన ప్రైవేటు గూడాచారి సంస్థకు పనిచేసేవారని తర్వాత రివీల్ అవుతుంది. ఈ ట్రైలర్ లో సిరీస్ కథను ఏమాత్రం రిలీజ్ చేయలేదు. మంచులో, ట్రైన్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైలర్ ను నింపేశారు.ఏప్రిల్ 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement