Sunday, March 24, 2024

హోలీ సంబరాల్లో కవిత స్టెప్పులు.. వీడియోతో

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోలీ వేడుకల్లో భాగంగా విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కాలేజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా శక్తి గురించి మాట్లాడారు. అనంతరం మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత హోలీ సెలబ్రేషన్స్‌‌‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత విద్యార్థినులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులపైకి రంగులు చల్లారు. విద్యార్థినులు కూడా కవిత వద్దకు చేరుకుని ఆమెకు రంగులు పూసారు. అంతేకాకుండా మంత్రి మల్లారెడ్డి కోడలు షాలినీ, కాలేజ్ విద్యార్థినులతో కలిసి కవిత సరదాగా డ్యాన్స్ చేశారు. దీంతో కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఆనందంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement