Tuesday, April 30, 2024

జియో వరల్డ్‌ సెంటర్‌కు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

రిలయన్స్‌ ఇండస్ట్రీ కంపెనీ అంటే అంత ఆషామాషీగా ఉండదు. ఇటీవల ముంబైలోని ప్రారంభించిన జియో వరల్‌ ్డ సెంటర్‌కు రక్షణగా 200 మందికి పైగా సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను కేటాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ముంబైలో వ్యాపార, వినోద కేంద్రమైన జియో వరల్‌ ్డ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సెంటర్‌.. ఫిఫా ఫుట్‌బాల్‌ మైదానం కంటే 12 రెట్లు పెద్దదిగా ఉంటుంది. న్యూయార్క్‌లోని ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ కంటే 10.3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ కేంద్రం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని టోనీ బాంద్రా కుంద్రా కాంప్లెక్స్‌ (బీకేసీ) వద్ద 18.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) భద్రత ఇస్తున్న మూడో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కేంద్రంగా ఉండింది.

ఇప్పటికే రెండు కేంద్రాలకు..

నవీ ముంబైలోని రియలన్స్‌ ఐటీ పార్క్‌, గుజరాత్‌ జామ్‌నగర్‌లోని రియలన్స్‌ రిఫైనరీకి ఇంతకుముందు కేంద్ర పారా మిలిటరీ బలగాలు భద్రత కల్పించాయి. రిల్‌ ప్రమోటర్లు ముఖేష్‌ అంబానీ, ఆయన భార్య, రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్‌పర్సన్‌ నీతా అంబానీలకు సీఆర్‌పీఎఫ్‌ వీఐపీ భద్రతను కల్పిస్తుంది. దాదాపు 230 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని ఈ కేంద్రంలో మోహరిస్తారు. ఉగ్రవాద నిరోధక రక్షణకు సంబంధించిన అన్ని సదుపాయాలను కల్పిస్తారు. నెలాఖరులోగా ఈ దళం విధుల్లో చేరుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. జియో వరల్డ్‌ సెంటర్‌కు ఉగ్రవాద ముప్పు, బెదిరింపులకు సంబంధించిన కారణాల ఫలితంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెంటర్‌ భద్రతను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement