Friday, April 26, 2024

‘అద్భుతం’గా ఉంది: చిరంజీవి రివ్యూ

జాంబిరెడ్డి మూవీతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా తాజాగా నటించిన సినిమా ‘అద్భుతం’. శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 19వ తేదీన ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, సినిమాను గురించి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిక ట్వీట్ చేశారు. “నిన్న రాత్రే హాట్ స్టార్ లో ‘అద్భుతం’ సినిమాను చూశాను. ఇది ఒక న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్ సినిమా. తేజ సజ్జ .. శివాని ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. వారి నటన చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సినిమా టీమ్ లోని అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది” అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

ఇక, చిరు ట్వీట్ కి హీరోతేజ రిప్లై ఇచ్చారు.  ఇంతటి ప్రోత్సాహకరమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement