Sunday, November 28, 2021

Breaking : బ‌స్సులో మంట‌లు..45మంది స‌జీవ ద‌హ‌నం..ఏడుగురికి గాయాలు..

ప్ర‌మాద‌వ‌శాత్తు ల‌గ్జ‌రీ బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి..దాంతో బ‌స్సులో ప్ర‌యాణిస్తోన్న 45మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు..ఈ దుర్ఘ‌ట‌న యూర‌ప్ లోని బ‌ల్గేరియాలో చోటు చేసుకుంది. ఈ బస్సు బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది. ఈ ఘటనలో 45 మంది మరణించగా, ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News