Wednesday, May 1, 2024

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చిరు బ‌ర్త్‌డే విషెస్‌..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా మొద‌ల‌య్యాయి. అటు సినీ ప్ర‌ముఖులు, ఇటు రాజ‌కీయ నాయ‌కుల నుండి బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ న‌టుడు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ట్విట్ట‌ర్లో బ‌ర్త్‌డే విషెస్‌ను తెలిపాడు. చిరంజీవి ‘త‌న ఆశ‌, ఆశ‌యం ఎల్ల‌ప్పుడూ జ‌న‌హిత‌మే. తాను న‌మ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్త శుద్ధితో శ్ర‌మించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌యాల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుంటూ, ఆశీర్వ‌దిస్తూ, క‌ళ్యాణ్ బాబుకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement