Thursday, April 18, 2024

Big Story | సరిహద్దుల్లో చైనా గ్రామాలు.. ఉత్తరాఖండ్‌కు సమీపంలో కట్టడాలు

ఇప్పటికే భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభనలో చిక్కుకున్న చైనా, ఈ వివాదాన్ని మరింత జటిలం చేసేదిశగా కదులుతోంది. ఉత్తరాఖండ్‌కు ఆనుకుని సరిహద్దు రక్షణ గ్రామాలను నిర్మిస్తోంది. 250 ఇళ్లతో కూడిన ఈ సరిహద్దు గ్రామాలను వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)కి 11 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఎ) పర్యవేక్షణలో ఉన్న ఉత్తరాఖండ్‌కు ఆనుకుని ఉన్న ఎల్‌ఎసి నుండి 35 కిలోమీటర్ల దూరంలో దాదాపు 55-56 ఇళ్ల నిర్మాణంలో చైనా కూడా పాలుపంచుకుంది. కేవలం సరిహద్దు వెంబడి తూర్పు సెక్టార్‌లో 400 గ్రామాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉత్తరాఖండ్‌ చైనాతో 350 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. చాలా వరకు సరిహద్దు గ్రామాలు జీవనోపాధి అవకాశాల కొరత కారణంగా బయటి ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. కాగా, సరిహద్దు పరిస్థితుల్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు భారత సైన్యం ఇంతకుముందు తెలిపింది.

భారతదేశ వ్యూహాత్మక సొరంగం

ఉత్తరాఖండ్‌లోని ఘటియాబాగర్‌-లిపులేఖ్‌ రహదారిపై బుండి-గర్బియాంగ్‌ మధ్య 6 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మించనున్నారు. ఇది భారత్‌-చైనా సరిహద్దులోని లిపులేఖ్‌ పాస్‌ చివరి సరిహద్దు పోస్ట్‌కు మార్గాన్ని మరింత సౌకర్యవతంగా చేస్తుందని బీఆర్‌వో సీనియర్‌ అధికారిఒకరు చెప్పారు. టన్నెల్‌ సర్వే పనుల కాంట్రాక్టును ఎటిఐ- ఎన్‌ఒకె ఇండియా కన్సల్టెంట్స్‌కు అప్పగించారు. కంపెనీ సర్వే పనులను ప్రారంభించి, ఏడాది వ్యవధిలో తుది ప్రతిపాదనను సమర్పిస్తుంది అని ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ హరాక్‌ విమల్‌ గోస్వామి తెలిపారు.రూ. 2,000 కోట్ల ప్రాజెక్టు నాలుగైదైళ్లలో ప్రారంభం కావచ్చని తెలిపారు. ”బిఆర్‌ఒ ప్రతిపాదిత సొరంగం దృష్ట్యా బుండి నుండి గర్బియాంగ్‌ సింగిల్‌ లేన్‌ వరకు సరిహద్దు రహదారిని ఉంచింది. మిగిలినవి డబుల్‌ లేన్‌గా ఉండబోతున్నాయి అని గోస్వామి చెప్పారు. 2020లో ప్రారంభించబడిన సరిహద్దు రహదారి బ్లాక్‌టాప్‌ చేయబడి డబుల్‌ లేన్‌గా రూపుదిద్దుకుంటోంది. డబుల్‌ లేనింగ్‌ పనులు చాలా వరకు పూర్తయ్యాయని తెలిపారు.

- Advertisement -

భూటాన్‌ సరిహద్దుల్లో చైనా స్థావరాలు..

అంతకుముందు ఏప్రిల్‌లో, భూటాన్‌లోని అమో చు నది లోయలో చైనా భారీ నిర్మాణాలపై భారత సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమో చు వ్యూహాత్మక డోక్లామ్‌ పీఠభూమికి ఆనుకుని ఉంది. ఇక్కడ నుండి భారతదేశ సిలిగురి కారిడార్‌ చైనా పిఎల్‌ఎ ప్రత్యక్ష రేఖలో ఉంది. అమో చులో కమ్యూనికేషన్‌ టవర్‌లతో పాటు పిఎల్‌ఎ దళాలకు శాశ్వత నివాసాల్ని నిర్మించినట్లు స్పష్టమవుతోంది. దాదాపు 1,000 శాశ్వత సైనిక గుడిసెలు అలాగే అనేక తాత్కాలిక షెడ్‌లు ఇటీవలి నెలల్లో వేల మంది చైనా బలగాలను కలిగివున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement