Saturday, April 27, 2024

SSMB 28 టైటిల్ రివీల్ కి డేట్ ఫిక్స్.. ప్ర‌క‌టించిన మేక‌ర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరి కాంబినేష‌న్ లో ఇప్ప‌టిక‌ర‌కు అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలు వ‌చ్చాయి. కాగా, ఇప్పుడు వారు మూడవసారి ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం మళ్లీ కలిశారు. తాత్కాలికంగా SSMB 28 అని పేరుతో షూటింగ్ జ‌రుగుతుంది.. కాగా, మే 31న ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. SSMB 28 టైటిల్‌ను లెజెండరీ సూపర్‌స్టార్ స్వర్గీయ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా వెల్లడిస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌ను మహేష్ అభిమానులు పెద్ద స్క్రీన్‌లపై విడుదల చేయనున్నారు.

- Advertisement -

భారీ అంచనాలున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు. జగపతిబాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2024 పొంగల్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement