Sunday, May 5, 2024

PM MODI: పూల్వామా అమ‌ర జ‌వాన్ల‌కు ప్ర‌ధాని నివాళులు..

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్ర‌ధాని మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్విట్టర్ (ఎక్స్‌)లో ప్రధాని మోడీ తెలిపారు.

ఇక, జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి ఇవాళ్టికి ఐదేళ్లు పూర్తి అయ్యాయి. కాగా, పుల్వామా ఉగ్రదాడి 2019, ఫిబ్రవరి 14న జరిగింది. భారతదేశంపై జరిగిన భారీ తీవ్రవాద దాడుల్లో ఇది కూడా ఒకటి.. ఆ చీకటి రోజున ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు మరణించారు. ఈ ఘటనలో మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరోజు సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2500 మందికి పైగా సైనికులు ప్రయాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement