Monday, April 29, 2024

Chess World Cup Final | డ్రాగా ముగిసిన ఫ‌స్ట్ రౌండ్..

ఇవ్వాల (మంగళవారం) అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన FIDE ప్రపంచకప్ ఫైనల్‌లో ఇండియ‌న్ చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ ప్రజ్ఞానానంద, మాగ్నస్ కార్ల్‌సన్‌లు ఒకటో రౌండ్‌ని డ్రాగా ముగించారు. గేమ్ లోని 35వ‌ మూవ్ వ‌ద్ద పరస్పర అంగీకారంతో ఇద్ద‌రు ఆట‌గాళ్లు డ్రాకు (0.5-0.5) అంగీకరించారు.

ఇక రేపు (బుధవారం) జరగనున్న ఫైనల్ లోని రెండో రౌండ్ మరోసారి తలపడనున్నారు ఈ గ్రాండ్ చెస్ మాస్టర్స్. అయితే, రేపు జ‌ర‌గ‌నున్న మ్యాచ్ లో కూడా రెండో క్లాసికల్ రౌండ్ ముగిసే సమయానికి స్కోర్లు ఒకే స్థాయిలో ఉంటే మ్యాచ్ గురువారం టైబ్రేక్స్‌లోకి వెళుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement