Monday, April 29, 2024

chennai: తిరుచ్చిలో దారుణం.. విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తిరుచ్చిలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. విద్యార్థినిని పదిసార్లు ఉన్మాది కత్తితో పొడిచాడు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా ప్రేమోన్మాది కేశవన్ పెళ్లిచేసుకోవాలంటూ విద్యార్థినిని వేధిస్తున్నాడు. విద్యార్థిని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు. కేశవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement