Sunday, June 4, 2023

Sankranthi Holidays : ఏపీలో సంక్రాంతి సెలవుల మార్పు.. కొత్త తేదీలివే..

ఏపీలో సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సంక్రాంతి సెలవులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మొదట విడుదల చేసిన షెడ్యూల్ మార్పు చేసింది. మొదటి షెడ్యూల్‌ ప్రకారం జనవరి 11 నుంచి 16వరకు సెలవులు ఉండగా సవరించిన ఉత్తర్వు ప్రకారం వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 17న ముక్కనుమ ఉన్నందున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు అందడంతో ఈ మార్పు చేశారు. 18 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్‌ జాబితాను అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు పంపించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement