Saturday, April 27, 2024

చంద్ర‌ముఖి2.. అప్ డేట్ ఇచ్చిన కంగ‌నార‌నౌత్

చంద్ర‌ముఖి చిత్రానికి సీక్వెల్ గా చంద్ర‌ముఖి2 తెర‌కెక్కుతోంది.ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్​లో శరవేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ గురించి ఎప్పటికప్పుడు ​ అప్డేట్స్​ ఇస్తూనే ఉంది హీరోయిన్ కంగ‌నార‌నౌత్. వ్యానిటీ వాన్ లో మేకప్ వేసుకుంటూ రెడీ అవుతున్న ఫోటోలు పంచుకుంది కంగనా. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్ వడివేలు సైతం ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసునే చంద్రముఖి 2కు దర్శకత్వం వహిస్తున్నారు.. ప్రస్తుతం కంగనా చంద్రముఖి 2 సినిమాతో పాటు మణికర్ణిక రిటర్న్స్, టీకు వెడ్స్ షేరు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కంగనా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన సినిమాలకు షూటింగ్ సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకుంటుంది ఈ భామ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement