Friday, May 3, 2024

చంద్రబాబు క్యాష్ పిటిషన్ పై విచారణ

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ కేసు కొట్టివేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. విచారణను మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూద్రా వాదనలు వినిపిస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ తరుపున హైకోర్టు సీనియర్ న్యాయవాది దమ్మటపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తున్నారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం ఆయుధంగా ఉపయోగించుకుంటున్న ఈ కేసులో.. అరెస్టు సహా తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని కోర్టును చంద్రబాబు కోరారు. అక్రమ పద్ధతుల్లో తెలుగుదేశం నాయకులను కేసుల్లో ఇరికించడం, విచారణ పేరుతో వేధించడాన్ని గతంలో కోర్టులు తప్పుబట్టాయని.. వాటన్నింటిని కొట్టివేశాయని . చంద్రబాబు తరఫు న్యాయవాది గుర్తుచేశారు.

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసుల ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. అమరావతి భూ కుంభకోణం కేసులో పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరును చేర్చారు. రాజధాని భూముల కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా చంద్రబాబు వ్యవహరించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు సహా మాజీ మంత్రి నారాయణ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఐపీసీ సెక్షన్ 120బీ, 166,167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సీఐడీ కేసు నమోదుచేసింది.. అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement