Tuesday, April 30, 2024

సాంగ్ లో సిగరెట్ – విజ‌య్ పై కేసు న‌మోదు

YouTube video

కోలీవుడ్ స్టార్ విజయ్ డైరెక్టర్ లొకేష్ కనగరాజ్ దర్శకత్వం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా రూపొందుతున్న మూవీ లియో.. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఇక ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. అలాగే ఇటీవల విడుదలైన నా రెడీ సాంగ్ సైతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడిదే పాట విజయ్ దళపతిని చిక్కుల్లోకి నెట్టింది. కేవలం విజయ్ మాత్రమే కాదు ..మొత్తం చిత్రయూనిట్ పై కేసు నమోదు అయ్యింది. అందుకు కారణం అందులో విజయ్ సిగరెట్ తాగుతున్నట్లు కనిపించడమే.


ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించాంటూ చెన్నైకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ.సెల్వం కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు దళపతితోపాటు.. చిత్రబృందంపై ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశాడు. వీరిపై నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో చిత్ర హీరోతో స‌హ యూనిట్ మొత్తంపై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement