Sunday, April 28, 2024

Captain miller తెలుగు ట్రైలర్ రిలీజ్ !

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ హీరోగా యువ దర్శకుడు అరుణ్ మతేశ్వరన్ తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘‘కెప్టెన్ మిల్లర్’’. ఈ మూవీ ఇప్పటికే తమిళ్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్‌తో కొనసాగుతోంది. కాగా, తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసారు. ట్రైలర్ లో గ్రాండియర్ విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో అలరించింది.

YouTube video

సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో.. ప్రియాంక మోహన్ హారోయిన్‌గా సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాని తెలుగులో జనవరి 25న గ్రాండ్ గా సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ మల్టిప్లెక్స్ ప్రైవేట్ లిమిట్ వారు కెప్టెన్ మిల్లర్ ని రిలీజ్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement