Wednesday, May 15, 2024

ఆసియా కప్‌ నిర్వహించలేం.. చేతులెత్తేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు..

కొలంబో : శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడు తున్నది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు శ్రీలంకలో ఆసియా కప్‌ జరగాల్సి ఉండగా.. ఆ దేశ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తీవ్ర సంక్షోభం నేపథ్యంలో ఆసియా కప్‌ నిర్వహించలేమని చేతులె త్తేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ కు విజ్ఞప్తి చేసింది. వేదికను మార్చాలంటూ సూచించిం ది. ఈ మేరకు ఏసీసీ అధ్యక్షుడు జైషా కు లంక క్రికెట్‌ బోర్డు వినతిపత్రం సమర్పించింది. జైషాతో పాటు బీసీసీఐ అధికా రులు, శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా అహ్మ దాబాద్‌లోనే ఉన్నారు.

జై షా నేతృత్వంలో అహ్మదాబాద్‌లోనే ఆసియా క్రికెట్‌ కప్‌ నిర్వహణకు సంబంధించిన భేటీ ఏర్పాటు చేశారు. శ్రీలంకలో ఆసియా కప్‌ నిర్వహణ కష్టమే అని బోర్డు చెప్పగా.. ఏసీసీ సభ్యులందరూ మద్దతు పలికారు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. యూఏఈ లేదా బంగ్లాదేశ్‌లో ఆసియా కప్‌ నిర్వహిం చాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచా రం. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే ఈ పోరులో భారత్‌తో పాటు పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌, యూఏఈ జట్లు పాల్గొంటాయి

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement