Friday, May 10, 2024

Order order | “డార్లింగ్” అని పిలిస్తే జైలుకే.. కలకత్తా హైకోర్టు

పరిచయం లేని అమ్మాయిలను ‘డార్లింగ్’ అని పిలవడం లైంగిక వేధింపు కిందకే వొస్తుంది అంటూ కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. డార్లింగ్.. అని పిలిచిన‌ వారిని 354ఏ, 509 కింద నిందుతులుగా భావించొచ్చు అని పేర్కొంది. ఈ మేరకు పోర్టు బ్లెయిర్‌లోని హైకోర్టు బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జై సేన్‌గుప్తా తీర్పు వెలువరించారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళా కానిస్టేబులుని ‘డార్లింగ్’ అని పిలవడంపై దాఖలైన కేసు విచారణలో కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. పరాయి స్త్రీలను ఇష్టం వచ్చినట్లు పిలిచే స్థాయికి భారత్ దిగజారలేదని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement