Monday, October 21, 2024

సైకో థ్రిల్లర్ నేపథ్యంలో బటర్ ఫ్లై చిత్రం.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

సైకో థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది బటర్ ఫ్లై చిత్రం. ఈ చిత్రం నుండి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. నగరంలో ఒక సైకో వరుసగా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి .. ఆ తరువాత చంపేస్తుంటాడు. అతను పెట్టుకున్న ఈ ఆపరేషన్ పేరే ‘బట్టర్ ఫ్లై’. ఒక అపార్టుమెంటులోని ఫ్లాట్ లో నాయిక‌ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఓ రోజున నాయిక ఇద్దరు పిల్లలను ఒక సైకో కిడ్నాప్ చేస్తాడు. అతని బారి నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎంతగా తాపత్రయ పడిందనేదే కథ అనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. రావు రమేశ్ .. భూమిక ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా ‘బటర్ ఫ్లై’ సినిమా రూపొందింది. రవి ప్రకాశ్ – ప్రసాద్ – ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకి, ఘంట సతీశ్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ నెల 29 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

https://www.youtube.com/watch?v=puz3QoiRNbk
Advertisement

తాజా వార్తలు

Advertisement