Saturday, May 4, 2024

చావులతో వ్యాపారం

కరోనా.. ఎన్నో దారుణాలను కళ్లముందు ఉంచుతోంది. బెడ
కొరత, మందుల కొరత, చివరకు ఆక్సిజన్ అందక.. పిట్టల్లా జనం చనిపోయే పరిస్థితికి వచ్చింది. అంత్యక్రియలకు కూడా స్లాట్ బుకింగ్, శవాలు పూడ్చేందుకు స్థలాలు దొరకని స్థితి
ఏర్పడింది. అడుగడుగునా ప్రజల ప్రాణాలతో చెలగాటం. ప్రతిదీ బ్లాక్ మార్కెట్. ఇలాంటి దారుణాలు, అమానవీయ సంఘటనలే చూడ లేని స్థితి ఉంటే.. ఇంతకు మించిన అమానవీయ గుండెను కుదిపే సంఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి విలయానికి జనం విలవిల్లాడుతుంటే.. ఈ కష్టాలు, భయాలు చాలవన్నట్లు ఇపుడు కొత్త రకం మాఫియా బయలుదేరింది. శవాల మీద చిల్లర ఏరుకునే దుర్మార్గులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమకు గిరాకీ లేదని
ఏకంగా ఐసీయూలోని కరోనా రోగులను చంపేందుకు కూడా వెనుకాడలేదు కిరాతకులు. కరోనా రోగులకు సీరియస్ అయినా, చనిపోయినా తమకు కిరాయి వస్తుందని కొందరు
అంబులెన్స్ డ్రైవర్లు అత్యంత దారుణానికి పూనుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ నిలిపేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు.

దొంగతనంగా ఆస్పత్రి లోకి ప్రవేశించి ఆక్సిజన్ సరఫరా ఆపేయడంతో కాసేపు రోగులు అల్లాడారు. ఆస్పత్రి వార్డుబాయ్ ఆ దారుణాన్ని చూడడంతో రోగుల ప్రాణాలు నిలిచాయి. తక్షణమే ఆస్పత్రి ఉన్నతాధికారు లకు వార్డుబాయ్ సమాచారం అందించడంతో అందరూ అప్రమత్తమయ్యారు. నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో ఈ దారుణం వెలుగు చూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారిస్తున్నారు. ఆస్పత్రికి చేరడం, బెడ్లు దొరికించుకుని ట్రీట్మెంట్ పొందుతూ కోలు కోవడమే గగనమైతే.. లతో చెలగాటమాడారు. దొంగతనంగా ఆస్పత్రి లోకి ప్రవేశించి ఆక్సిజన్ సరఫరా ఆపేయడంతో
కాసేపు రోగులు అల్లాడారు. ఆస్పత్రి వార్డుబాయ్ ఆ దారుణాన్ని చూడడంతో రోగుల ప్రాణాలు నిలిచాయి. తక్షణమే ఆస్పత్రి ఉన్నతాధికారు లకు వార్డుబాయ్ సమాచారం అందించడంతో అందరూ అప్రమత్తమయ్యారు. నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో ఈ దారుణం వెలుగు చూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారిస్తున్నారు. ఆస్పత్రికి చేరడం, బెడ్లు దొరికించుకుని ట్రీట్మెంట్ పొందుతూ కోలు కోవడమే గగనమైతే.. నియంత్రణ లేని దందా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అంబులెన్స్ డ్రైవర్ల దందా, అమానవీయత ప్రాణాల కోసం చివరిక్షణాల్లో పాకులాడే కుటుంబాలకు కళ్ల నుండి రక్తాశ్రువులు రప్పిస్తోంది. గతంలో కిలోమీటరు లెక్కన ధరలు ఉండేవి. ఇప్పుడు నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రాంతాలను బట్టి ధరలు, జిల్లా సరిహద్దు ప్రాంతాలైతే మరో రేటు, ఇతర జిల్లాలకైతే మరో రేటు అన్నట్లు ధరలు నిర్ణయించి దోపిడీ చేస్తున్నారు.

బేటా రూపంలో ఇక రాత్రివేళల్లో అయితే అంబులెన్స్ నిర్వాహకుల నోటికే మొక్కాలి. వారు ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే. గతంలో పది వేల రూపాయలు లోపు అయిపోయే కిరాయికి ఇపుడు రూ.40 నుండి 70 వేల వరకు వసూలు చేస్తున్న పరిస్థితి. రూ.8 నుండి 5 వేల వరకు అయ్యేవాటికి రూ.20 నుండి 30 వేలు రకరకాల పేర్లతో వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ అంబులెన్లపై అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం, నిర్వాహకుల ఆగడాలను నియంత్రించకపోవడం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంబులెన్ల నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా అధిక ధరలు వసూలు చేస్తున్నా పట్టించుకున్న వారు కరువయ్యారు. ప్రైవేట్ అంబులెన్లు ఉండాలంటే ఏదో ఒక ఆస్పత్రికి అనుసంధానంగా నమోదు కావాలి. అంబులెన్ను నడిపేవారు అనుభవం కలిగి ఉండాలి. ప్రాథమిక చికిత్స చేయగలగాలి. రోగికి అత్యవసర పరిస్థితి తలెత్తితే ఆస్పత్రికి వెళ్లే వరకు ప్రాణాపాయం లేకుండా చూడగలిగే సమర్థత ఉండాలి. ఒక ప్రాంతం నుంచి వెళ్లే సమయంలో అదనపు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. కానీ ఆ నిబంధనలన్నీ ఎక్కడా కనిపించడం లేదు.

ప్రైవేట్ అంబులెలకు సిలిండర్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇష్టారాజ్యంగా సిలిండర్లు వినియోగించే అవకాశం లేదు. ఫలితంగా బ్లాక్ మార్కెట్లో తీసుకొచ్చామంటూ అధిక ధరలు రోగి కుటుంబీకులపైనే మోపుతున్నారు. కొన్ని అంబులెన్లలో అదనపు సిలిండర్లు ఉండకపోవడంవల్ల మార్గమధ్యలోనే రోగులు చనిపోయిన సందర్భాలూ చోటుచేసుకున్నాయి. ఇక ఏ ప్రైవేట్ ఆస్పత్రి పేరిట నమోదైతే అక్కడే అంబులెన్ను ఉంచాలి. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అడ్డాలు పెడుతున్నారు. అసోసియేషన్లు ఏర్పాటు చేసి సిండికేట్ గా మారి ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. కొన్నిసార్లు రోగి బంధువులు వెళ్లాలనుకున్న ఆస్పత్రులకు కాకుండా మరో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆస్పత్రులతో ముందే కమీషన్లు మాట్లాడుకుని రోగులను తరలిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అంబులెన్స్ నిర్వహణపైనా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాల్సి ఉంది. లేకుంటే నిజామాబాద్ తరహా ఆకృత్యాలు మరిన్ని చోటుచేసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement