Tuesday, May 14, 2024

INDvsIRE | బూమ్రా మ్యాజిక్.. ఐర్లాండ్‌పై భారత బౌల‌ర్ల డామినేషన్

డబ్లిన్‌ వేధిక‌గా ఐర్లాండ్ తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇవ్వాల (శుక్ర‌వారం) మెద‌టి మ్యాచ్ జ‌రుగుతోంది. కాగా, టీ20 లో భార‌త్ జట్టుకు తోలిసారి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు బూమ్రా. ఇక ఈ మ్యాచ్ లో మెద‌ట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వివెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులు చేసింది ఐర్లాండ్ జ‌ట్టు. ఇక ఈ మ్యాచ్ గెలిచేందుకు భార‌త్ 140 ప‌రుగులు చేయాల్సి ఉంది.

అయితే, ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ నుంచే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది టీమిండియా. మెద‌టి ఓవ‌ర్ లోనే రెండు వికెట్లు తీసాడు క‌ప్టెన్ బూమ్రా. ఇక అంత‌లోనే 11 ఓవ‌ర్ల‌లోపే 6 వికెట్ల‌ను కోల్పోయింది ఐర్లాండ్ జట్టు. బారీ మెక్‌కార్తీ *(51) హాఫ్ సెంచరీ, కర్టిస్ కాంఫర్ *(39) మిన‌హా, మిగితా ఎవ్వ‌రూ చెప్పుకోత‌గ్గ‌ ప‌రుగులు చేయ‌లేక‌పోయారు.

కాగా, భార‌త బౌల‌ర్ల‌లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్.. చ‌రో రెండు వికెట్లు ద‌క్కించుకోగా.. అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ ప‌డ‌కొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement