Thursday, April 25, 2024

లక్నో ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధికి బంపరాఫర్‌.. 1.10కోట్ల ప్యాకేజీతో గూగుల్ ఆఫర్

ఐఐఐటీ లక్నో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ అభిజిత్‌ ద్వివేదికి రూ.1.2 కోట్ల వార్షిక వేతనంతో అమెజాన్‌ నుంచి జాబ్‌ ఆఫర్‌ లభించింది. ఐర్లాండ్‌లోని అమెజాన్‌ డబ్లిన్‌ కార్యాలయంలో సాప్ట్‌nవేర్‌ డెవలప్‌ మెంట్‌ ఇంజనీర్‌గా అభిజిత్‌ ద్వివేది రికార్డుస్ధాయి ప్యాకేజ్‌ దక్కించుకున్నాడు. ఐఐఐటీ లక్నో చరిత్రలోనే గత వేతన ప్యాకేజ్‌ల రికార్డులను ప్రయాగరాజ్‌కు చెందిన ద్వివేది చెరిపేశాడు. కొవిడ్‌19 తగ్గుముఖం పట్టడంతో ఐఐఐటీ లక్నో విద్యార్ధులు అత్యధిక ప్యాకేజ్‌లతో నూరుశాతం ప్లేస్‌మెంట్‌ సాధించారు.

ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఐటీ లక్నో వార్షిక సగటు వేతనం రూ.26 లక్షలు పలికింది. ఇక ఇదే నెలలో ఎన్‌ఐటీ పట్నా స్టూడెంట్‌ అదితి తివారీ రూ.1.6 కోట్ల వార్షిక ప్యాకేజ్‌ను దక్కించుకుంది. జనవరిలో మరో బిహార్‌ విద్యార్థి రూ.1.10 కోట్ల ప్యాకేజ్‌తో టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఆఫర్‌ సొంతం చేసుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement