Thursday, April 25, 2024

రెండోరోజూ పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఆందోళన.. హిండెన్‌బర్గ్‌పై జేపీసీ ఏర్పాటుకు పట్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలంటూ బీఆర్‌ఎస్ రెండోరోజు కూడా పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టింది. రాజ్యసభ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఖమ్మం ఎంపీ, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో విపక్షాలతో కలిసి ఆ పార్టీ ఎంపీలు ఉభయ సభల్లో నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నినానాదాలు చేశారు. విపక్షాల ఆందోళనతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

- Advertisement -

మళ్లీ నిరసన మొదలవడంతో బుధవారానికి సభ వాయిదా పడింది. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ… హిండెన్ బర్గ్ అంశంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, పెరిగిపోతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, నిరుద్యోగం, తదితర అంశాలపై తక్షణమే పార్లమెంట్ ఉభయ సభల్లో విస్తృత చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులపైనా తక్షణమే ఉభయ సభల్లో చర్చించాలని, ఆదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పట్టు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్‌లో చర్చకు అనుమతించకుండా వెనక్కి పోతోందని నామా విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement