Friday, April 19, 2024

బేస్‌ రేటును 10.10 శాతం పెంచిన ఎస్‌బీఐ.. రేపటి నుంచే అమలు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మార్చి 15 నుంచి దాని బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (బీపీఎల్‌ఆర్‌) ని 70 బేసిస్‌ పాయింట్లు (బీపీఎస్‌) లేదా 0.7 శాతం నుంచి 14.85 శాతానికి పెంచనుంది. ప్రస్తుత బీపీఎల్‌ఆర్‌ 14.15 శాతంగా ఉంది. దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ లెండర్‌ కూడా బేస్‌ రేటును 9.40 శాతం నుంచి 10.10 శాతానికి 70 బీపీఎస్‌లు పెంచనుంది. ఎస్‌బీఐ తన బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటుతో పాటు బేస్‌ రేటును డిసెంబర్‌ 15, 2022న సవరించింది. అయితే, పబ్లిక్‌ లెండర్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేట్ల మార్జినల్‌ కాస్ట్‌ ను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.

ఇది గృహ రుణాల రేటుపై ప్రభావం చూపదని తెలిపింది. ఎంసీఎల్‌ఆర్‌ అనేది బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇచ్చే రేటు. ఎస్‌బీఐ చివరిసారిగా ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను ఫిబ్రవరి 15, 2023న 10 బేసిస్‌ పాయింట్ల లేదా 0.1 శాతం పెంచింది. ప్రస్తుతం, ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ 7.95 శాతంగా ఉండగా, నెలవారీ ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.10 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు, ఆరు నేలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు వరుసగా 8.10 శాతం, 8.40 శాతంగా ఉన్నాయి.

ఒక సంవత్సరం రుణాలు, రెండేళ్ల రుణాలు, మూడేళ్ల రుణాలకు ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు వరుసగా 8.50 శాతం, 8.60 శాతం, 8.70 శాతం ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫిబ్రవరి 8న ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల పెంచి 6.50 శాతానికి చేర్చిన తర్వాత ఎస్‌బీఐ తన కస్టమర్లకు రుణాలు ఇచ్చే రేటును పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement