Friday, May 3, 2024

బ్రో ఐ డోంట్ కేర్.. బాల‌య్య 108కి టైటిల్ ఫిక్స్

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి సినిమా టైటిల్స్ డిఫ‌రెంట్ గా ఉంటాయి. కాగా ఈ ద‌ర్శ‌కుడు హీరో నందమూరి బాలకృష్ణతో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి కామెడీ కథలను నమ్ముకుని హిట్టు సాధించిన అనిల్‌.. మొదటి సారిగా మాస్‌ యాక్షన్‌ సినిమా తీస్తున్నాడు. అది కూడా మాస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బాలయ్యతో. మరి ఈ కాంబో బాక్సాఫీస్‌పై ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కే. రాఘవేంద్ర రావు, దిల్‌రాజు, అల్లు అరవింద్‌, గెస్ట్‌లుగా వచ్చారు. ఈ సినిమాకు ‘బ్రో ఐ డోంట్‌ కేర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య 45ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుంది. షైన్‌ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అర్జున్ రామ్‌పాల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement