Monday, April 29, 2024

రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ లో బ్రేకింగ్ ఇష్యూ.. 26వేల వాహనాలు వెనక్కి..

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 మోడల్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేసారు. అయితే ఈ బైక్‌లను లక్ష యూనిట్లకు పైగా కంపెనీ తయారు చేసింది. ఈ బైక్‌లో పలు సమస్యలు ఉన్న కారణంగా విక్రయించిన బైక్‌లను వెనక్కి తీసుకోవాలని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నిర్ణయించింది. ఈ బైక్‌లో బ్రేకింగ్‌ సమస్య ఉన్నట్టు గుర్తించి ఈ మోడల్‌కు చెందిన అన్ని బైక్‌లను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటోంది.

ఈ సమస్య 2021 సెప్టెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 5 మధ్య తయారైన 26,300 మోడళ్లను ప్రభావితం చేస్తోంది. ఈ తేదీల్లో తయారైన బైక్‌ల గురించి వాటిని వెనక్కి తీసుకునేలా కస్టమర్లను గుర్తిస్తోంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. వాటిని వెనక్కి తీసుకొచ్చిన తరువాత.. లోపాలను సరి చేస్తామని తెలిపింది. ఈ బైక్‌ 3 వేరియంట్స్‌లో విడుదలైంది. సింగిల్‌ సీటర్‌ క్లాసిక్‌ 350, ట్విన్‌ సీటర్‌ క్లాసిక్‌ 350, క్లాసిక్‌ 350 సింగిల్‌ ఎడిషన్‌ వేరియంట్లు అందుబాటులో వచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement