Thursday, May 2, 2024

ఎంబీఏ అడ్మిష‌న్ల‌కు ఎంట్రెన్స్ టెస్ట్‌.. ఆదివారం అంబేద్క‌ర్ వ‌ర్సిటీలో ఎగ్జామ్‌

ఎంబీఏ అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌మైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (B.R.A.O.U). అపోలో, కిమ్స్, డెక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (డీఈటీ) సహకారంతో హాస్పిటల్ & హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ ప‌రిక్ష నిర్వ‌హించ‌నున్నారు.

అయితే.. ఆన్‌లైన్‌లో అప్ల‌య్ చేసుకోలేని అభ్యర్థుల కోసం.. స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా క‌ల్పిస్తున్న‌ట్టు వ‌ర్సిటీ అధికారులు తెలిపారు. అలాంటి వారిలో జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.1700 (ఆలస్య రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా) ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ కోసం రూ.1300 డిమాండ్ డ్రాఫ్ట్‌తో ఆదివారం ఉదయం 9 గంటలకు యూనివర్సిటీకి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement