Wednesday, May 29, 2024

TS | బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలు దానం.. మరో ఐదుగురికి ప్రాణదానం

మహేశ్వరం ఆర్బన్ (ప్రభ న్యూస్) : అంబేద్కర్ జయంతి రోజే నల్గొండ జిల్లా మల్లెపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు అంబేద్కర్ వెంకటయ్య బ్రెయిన్ డెడ్ కావడంతో అతని అవయవాలు దానం చేశారు. అంబేద్కర్ ఆశలకు అతను ఆదర్శప్రాయుడయ్యారు. మూడు రోజుల కిందట తుర్కయంజాల్ నుండి మల్లెపల్లికి వెళ్తుండగా మార్గమధ్య ఆగపల్లి గేటు వద్ద ప్రమాదానికి గురయ్యాడు.

తలకు బలమైన గాయం కావడంతో ఎల్బీనగర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.. ఈ క్రమంలో డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. దీంతో ఆదివారం కుటుంబ సభ్యుల సహకారంతో వెంకటయ్య అవయవాలు దానం చేయడానికి ఒప్పుకున్నారు. రాత్రి నిమ్స్ ఆస్పత్రి వైద్యులు వెంకటేష్ లివర్ ,కిడ్నీ, గుండె, నేత్రాలు, ఊపిరితిత్తులను సేకరించారు. వాటిని మరో ఐదుగురికి ప్రాణం పోయడానికి శ్రీకారం చుట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement