Monday, April 29, 2024

యూత్‌ఫుల్ కంటెంట్ తో ‘‘బాయ్స్ హాస్టల్’’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

నితిన్ కృష్ణమూర్తి ద‌ర్శ‌క‌త్వంలో నూతన నటులు ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్ కుమార్, శ్రీవాత్సవ, తేజస్ జయన్న యువర్స్ కీలక పాత్రలు చేస్తున్న మూవీ బాయ్స్ హాస్ట‌ల్. ఈ యూత్ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థల వారు తెర‌కెక్కిస్తున్నారు. కాగా, ఇటీవల కన్నడలో హుడుగారు బెకాగిద్దరే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఇక తెలుగులో బాయ్స్ హాస్ట‌ల్ అనే టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీలో రిషబ్ శెట్టి, తరుణ్ భాస్కర్, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్ తదితరులు క్యామియో పాత్రలు చేసారు.

కాగా, ఇవ్వాల‌ బాయ్స్ హాస్టల్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైల‌ర్ లో యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ సీన్స్ కూడా బాగున్నాయి. మొత్తంగా బాయ్స్ హాస్టల్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ముందుకి ఆగష్టు 26న రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement