Sunday, May 5, 2024

బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర – హ్యాష్ ట్యాగ్ తో ఫొటోలు షేర్ చేస్తోన్న నెటిజ‌న్స్

అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌. ఈ చిత్రం తెలుగులో బ్ర‌హ్మాస్త్రంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ జంటగా నటిస్తున్నారు..దక్షిణాది భాషల్లో ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రజెంట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు.ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితా బ్ బచ్చన్, మౌనీ రాయ్ నటించారు.విజ్యువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ పిక్చర్ పార్ట్ వన్: ‘బ్రహ్మాస్త్రం: శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఇటీవల ట్రైలర్ విడుదలైంది. కాగా, ఈ ట్రైలర్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్రైలర్ లో రణ్ బీర్ కపూర్ షూస్ తో టెంపుల్ లోకి ఎంటరయిన ఫొటోను పెట్టి ..ఇలా చేయడం సరి కాద‌న్నారు. #BoycottBrahmastra..బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర ..అనే హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఆలయంలో షూస్ తో ప్రవేశం ఉండకూడదని, కానీ, ట్రైలర్ లో రణ్ బీర్ కపూర్..అలా ఎంట్రీ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఒరిజినల్ గా క్రియేట్ చేయడం లేదని, దేనినో చూసి కాపీ చేశారని ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్..ను కూడా ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement