Saturday, December 9, 2023

వాల్తేరు వీర‌య్య నుండి ఫ‌స్ట్ సింగిల్ అప్ డేట్.. చిరంజీవి పోస్టర్ రిలీజ్

ద‌ర్శ‌కుడు బాబీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌ని పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ మూవీలో శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. 2023 జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా మేకర్స్ ఫస్ట్‌ సింగిల్‌ బాస్‌ పార్టీ అప్‌డేట్ అందించారు. నవంబర్ 23న సాయంత్రం 4 గంటలకు బాస్‌ పార్టీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ.. సాంగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చిరంజీవి అభిమానులకు ఇచ్చే అతిపెద్ద పార్టీగా ఈ సాంగ్‌ ఉండబోతుందని పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే చిరంజీవికి బ్లాక్‌ బస్టర్ ఆల్బమ్స్ అందించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ మరోసారి అదిరిపోయే సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది. ఈ చిత్రంలో ర‌వితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement