Thursday, May 2, 2024

Bomb Threat : సింగ‌పూర్ విమానానికి బాంబు బెదిరింపు..

సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు వ‌చ్చింది. దీంతో ఆ విమానానికి ఫైట‌ర్ జెట్స్ ను ఎస్కార్ట్‌గా పంపారు. త‌న చేతిలో ఉన్న బ్యాగులో బాంబు ఉన్న‌ట్లు ఓ ప్ర‌యాణికుడు బెదిరించారు. అయితే ఆ బెదిరింపు ఉత్త‌దే అని గుర్తించారు. దీనిపై సింగ‌పూర్ ర‌క్ష‌ణ శాఖ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. ప్ర‌యాణికులు, సిబ్బందిని సుర‌క్షితంగా దించిన‌ట్లు సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

గ‌తంలో కూడా ముంబై నుంచి సింగపూర్‌కు వెళుతున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో బాంబు పెట్టారన్న వార్త కలకలం రేపింది. మార్గ మధ్యలో విమానంలో బాంబు పెట్టారని బెదిరింపు రావడంతో రెండు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను సింగపూర్‌ వాయుసేన హుటాహుటిన తరలించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement