Monday, May 6, 2024

Poonam Pandey Dead: చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం… క్యాన్స‌ర్‌తో పూనమ్ పాండే క‌న్నుమూత

చిత్ర పరిశ్రమలో విషాదం నెల‌కొంది. బాలీవుడ్ న‌టి, మోడల్‌ పూనమ్ పాండే మృతి చెందారు. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతూ గురువారం రాత్రి పూనమ్ మృతి చెందిందని పూనమ్ పాండే రియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలిసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. పూనమ్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. ‘ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాను. ఈ దుఃఖ సమయంలో ఆమెను గుర్తుచేసుకోవాల్సి ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు పూనమ్‌ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌ పాండే.. 2013లో ‘నాషా’ తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. అప్పట్లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంకి వస్తానని ప్రకటించిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement