Thursday, May 2, 2024

చిరిగిన బట్టలతో నటి గెహన వశిష్ట..!

బాలీవుడ్ నటి గెహన వశిష్ట ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్ చేసిన ఓ ఫోటో అందరిని షాక్ కు గురిచేసింది. గెహన వశిష్ట చిరిగిన బట్టలతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే దీనిక గల కారణం ముంబై పోలీసులే అంటూ చెప్పుకొచ్చింది. రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె ఇన్ స్టాగ్రామ్ లో తన ఆవేదనను రాసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిరిగిన బట్టలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ దానికి కారణం ముంబై పోలీసులే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. “పోలీసులు నాకు ఈ దుస్థితిని తెచ్చారు. నా బ్యాంక్ ఖాతాలన్నీ బ్లాక్ చేశారు. చేతిలో డబ్బు లేదు. నేను ఇంటికి కూడా వెళ్లలేను. ఎందుకంటే ఇంటికి వెళితే పోలీసులు నన్ను మళ్లీ అరెస్ట్ చేస్తారు. నా మొబైల్‌, ల్యాప్‌టాప్‌లను పోలీసులు తీసేసుకున్నారు.

ఇంతకుముందు నేను బెయిల్ కోసం కారును తనఖా పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను కొంతమంది తెలియని వ్యక్తులతో నివసిస్తున్నాను. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిని కబ్జా చేశారు. న్యాయవాదికి చెల్లించాల్సిన డబ్బులు కూడా ఇతర దగ్గర అప్పుగా తీసుకుని ఇస్తున్నారు. ముంబై పోలీసులు ఇంతకన్నా ఏం చేస్తారు? మీకు ఇంకా సంతృప్తిగా అనిపించకపోతే నాపై తప్పుడు ఆరోపణలు చేయండి. ఏదో ఒక రోజు అంతా బయటకు వస్తుంది. నిజం బయట పడుతుంది. నా మొబైల్‌లో అంతా ఉంది. కానీ మీరు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. పర్వాలేదు… ఈ రోజు నాకు బ్యాడ్ టైం ఉండొచ్చు. రేపు మీకు కూడా ఇలాంటి టైం వస్తుంది” అంటూ సుదీర్ఘ పోస్టుతో తన బాధను వెళ్లగక్కింది.

ఇది కూడా చదవండి: 20 గ్రామాల కోసమే రాజధాని ఉండాలా?: మంత్రి బొత్స సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement