Tuesday, February 20, 2024

Khalistan :పార్లమెంట్ ను పేల్చేస్తా…ఖలిస్తానీ లీడర్ వార్నింగ్

కెనడాలో దాక్కున్న ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 13 న లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్ పై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఈమేరకు ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు.

”ఢిల్లీ బనేగా ఖలిస్తాన్” అనే శీర్షికతో 2001 పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్‌ ఉన్న వీడియోలో పన్నూన్ మాట్లాడారు. తనను చంపడానికి చేసిన కుట్ర విఫలమైనందున, డిసెంబర్ 13వతేదీ లేదా అంతకంటే ముందు పార్లమెంటుపై దాడి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తానని హెచ్చరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement