Thursday, April 25, 2024

ఈనెల 26న ఆకాశంలో అద్భుతం

ఈనెల 26న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆకాశంలో బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. ఈనెల 26న భూమికి దగ్గరగా రావడం వల్ల చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే పెద్దగా కనిపిస్తాడని సైంటిస్టులు తెలిపారు. ఎరుపు, నారింజ రంగుల్లో దర్శనమివ్వనున్నాడు. అందుకే దీనికి బ్లడ్ మూన్, రెడ్ మూన్ అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సహా కొన్ని దేశాల్లో ఈ గ్రహణం కనపడనుంది.

అటు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు బ్లడ్ మూన్ పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్‌లోనూ పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించనుంది. ఈ ఏడాదిలో మొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం ఇదే. అనంతరం జూన్ 10న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కాగా నవంబర్ 19న పాక్షిక చంద్రగ్రహణం, డిసెంబర్ 4న సంపూర్ణ చంద్రగ్రహణం రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement