Friday, May 3, 2024

బ్లాక్ బెేర్రీ ఇక కనుమరుగు.. అధికారికంగా నిలిచిపోయిన సేవలు..

బ్లాక్‌బెర్రీ ఫోన్లు చరిత్రలో కలిసిపోయాయి. మంగళవారం నుంచి ఫోన్లు పనిచేయడం అధికారికంగా ఆగిపోయాయి. దీంతో ఆదరణ కలిగిన క్వర్టీ కీప్యాడ్‌తో తయారు చేసిన ఈ ఫోన్లు ఇకపై కనిపించవు. ఒక పురాతన వస్తువుగా మాత్రమే వీటిని పరిగణించాలి. స్నేహితులకు ఫోన్లు చేయడం లేదా ఎస్‌ఎంఎస్‌లు పంపించడం సాధ్యపడదు. జనవరి 4 నుంచి బ్లాక్‌బెర్రీ సర్వీసులు నిలిచిపోనున్నట్టు, ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు కంపెనీ స్పష్టత ఇచ్చింది. బ్లాక్‌బెర్రీ 7.1 ఓఎస్‌తోపాటు ఇదివరకు లభ్యమైన బ్లాక్‌బెర్రీ 10 సాఫ్ట్‌వేర్‌, బ్లాక్‌బెర్రీ ప్లేబుక్‌ ఓఎస్‌ 2.1తోపాటు పాత వెర్షన్లు జనవరి 4 తర్వాత కూడా లభ్యమవ్వవు. ఫోన్లను వైఫ్‌ లేదా క్యారియర్‌పై కూడా పనిచేయవు. డేటాతోపాటు ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, ఎమర్జెన్సీ నంబర్లకు కూడా ఫోన్లు చేయడం సాధ్యపడదని కంపెనీ వివరించింది.

ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ఫోన్లు ఓకే..
ఆండ్రాయిడ్‌ ఓఎస్‌పై కొనసాగుతున్న ఫోన్లు మాత్రం పనిచేస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ఈ-మెయిల్‌ అడ్రస్‌ లేదా పేర్కొన్న ఈఎస్‌బీఎల్‌ (ఎన్‌హెన్స్‌డ్‌ సిమ్‌ బేస్డ్‌ లైసెన్స్‌) లేదా ఐబీఎల్‌ (ఐడెంటీ బేస్డ్‌ లైసెన్సెస్‌)కి ఫోన్ల నుంచి మెయిల్స్‌ వెళ్లకపోతే తప్ప.. ఈవోఎల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ సర్వీ సులు బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్‌ డివైజెస్‌ను ప్రభావితం చేయబోవని కంపెనీ స్పష్టత ఇచ్చిన విషయం తెలి సిందే. బ్లాక్‌బెర్రీ వినియోగదారులు ఈవోఎల్‌ తేదీకి ముందు కొత్త ఈ-మెయిల్‌ అడ్రస్‌కి మార్చుకోవాల్సి ఉం టుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement