Thursday, April 25, 2024

దేశంలో భారీ స్థాయిలో పెరిగిన బ్లాక్ ఫంగస్ కేసులు

దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. గత మూడు వారాల్లో ఇవి ఏకంగా 150 శాతం పెరిగి 31,216కు చేరుకున్నాయి. అలాగే దీని బారినపడి ఇప్పటి వరకు 2,109 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భారత వైద్య రంగంపై బ్లాక్ ఫంగస్ కేసులు మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. కేసులు పెరుగుతుండడంతో దీని చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి డ్రగ్‌కు విపరీతమైన కొరత ఏర్పడింది.

మహారాష్ట్రలో 7,057 బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడగా, 609 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. ఇక్కడ 5,418 మంది ఈ బ్లాక్ ఫంగస్ బాధితులుగా మారగా, 323 మంది మృతి చెందారు. బ్లాక్ ఫంగస్ కేసుల్లో రాజస్థాన్‌ది మూడోస్థానం. ఇక్కడ 2,976 కేసులు నమోదు అయ్యాయి. అయితే, కరోనా మరణాల్లో మాత్రం కర్ణాటక మూడో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 188 మంది బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందారు. మహారాష్ట్రలో మే 25న ఒకే రోజు 2,770 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, గుజరాత్‌లో 2,859 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఝార్ఖండ్‌లోనూ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం అతి తక్కువగా 23 మంది బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement