Sunday, June 13, 2021

ఏపీలో కొత్తగా కరోనా తో 61మంది మృతి…స్థిరంగా కేసులు

ఏపీలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మొత్తం 1,01,863 సాంపిల్స్ ని పరీక్షించగా 8,239 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా
నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల చిత్తూర్ లో పది, ప్రకాశం లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో ఏడుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, వైఎస్ఆర్ కడప లో నలుగురు, కృష్ణ లో నలుగురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు మరియు నెల్లూరు లో ఇద్దరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 11,135 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. అలాగే నేటి వరకు రాష్ట్రంలో 2,02,39,490 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…. 1796122
యాక్టీవ్ కేసుల సంఖ్య… 96100
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య …1688198
మొత్తం మృతుల సంఖ్య….11824

Advertisement

తాజా వార్తలు

Prabha News