Monday, April 29, 2024

హిందుత్వ నినాదంతోనే బీజేపీ గెలుపు: గెహ్లాట్‌

హిందుత్వ నినాదంతో పాటు మతపరంగా ఓటర్లలో చీలిక తీసుకురావడం వల్లే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని రాజస్ధాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. యూపీతో పాటు దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో బీజేపీ ప్రభుత్వాల వైఫల్యం ప్రతి ఒక్కరికీ తెలుసని అయితే ప్రచార ఆర్భాటంతో ప్రజల మైండ్‌సెట్‌ను మార్చివేసిందని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఐటీ, ఈడీ, సీబీఐలను ప్రయోగించి విషయం అందరికీ తెలుసున్నారు. ఈ విషయాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేరవేస్తే బీజేపీ నిజస్వరూపం వెల్లడవుతుందని అన్నారు.

గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌ పార్టీ ఐక్యంగా ఉండబోదని కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ ప్రకటన నేపధ్యంలో గెహ్లాట్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వం పటిష్టంగా ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలె కూడా హైకమాండ్‌కు బాసటగా నిలిచారు.పార్టీ ఆశించిన రీతిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా పేర్కొన్నారు. ఫలితాలపై సమీక్షించేందుకు వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించారని సుర్జీవాలా తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement